UPSC Civil Services (Main) Examination 2026 — Telugu (Compulsory): Question Paper | Plutus IAS

UPSC Civil Services (Main) Examination 2026 — Telugu (Compulsory): Question Paper | Plutus IAS

The questions below are from Telugu (Compulsory) of UPSC Civil Services (Main) Examination 2026 (held 2026-08-29) — the actual paper, which is public government content. This page carries the questions for reference and revision; model answers for this paper are not published here.

Official paper (PDF): upsc.gov.in.

  1. ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలలో ఒకదానికి 600 పదాలకు మించకుండా వ్యాసరూప సమాధానం వ్రాయండి : – (a) భారతదేశము అన్న భావన : మన భవిష్యత్తు – (b) అంకాత్మక (డిజిటల్) యుగంలో పౌరుల బాధ్యతలు – (c) మనదేశంలో అంతరిక్ష పరిశోధన : అంగారక గ్రహకక్ష్యలో ప్రదక్షిణ ప్రయోగం – (d) ఆరోగ్యసేవల అందుబాటు – నాణ్యత
  2. ఈ క్రింది తెలుగు వచనాన్ని ఆంగ్లంలోకి అనువదించండి : ప్రాక్షన కాలంనుంచి భారతీయ నావికులు తమ నౌకాయాన కౌశలానికి పేరెన్నిక గన్నారు. సుమారు ఐదువేల సంవత్సరాల మునుపు వీరు సముద్రయానం మొదలుపెట్టారు. ఆ కాలంలో సముద్రప్రయాణానికి ఉపకరించే సాధనాలు చాలా కొద్దిమాత్రమే ఉండేవి. ఎంతో అభివృద్ధి చెందిన ఈనాటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేవు. ఏది ఏమైనప్పటికీ ఆ పురాతన కాలపు నావికులకు వాతావరణంలో మార్పులను గురించి గాఢమైన అవగాహన ఉండేది. గ్రహగతులను పరిశీలించి, వాయు గమనాన్ని అర్థం చేసుకొని, నీటి రంగును బట్టి సముద్రపు లోతును గుర్తింపగలిగేవారు. సముద్రగర్భంలోని జీవాల ఉనికిని బట్టి తాము భూతలానికి ఎంత దూరాన ఉన్నదీ, ఒక్కొక్కప్పుడైతే ఏ దేశానికి సమీపంలో ఉన్నదీ నిశ్చయింపగలిగేవారు. ఆ రోజులలో సముద్రయాన శిక్షణ సంస్థలు లేనందున వారు తమ ప్రయత్న సాఫల్య వైఫల్యాల మూలంగానూ, అనుభవం ద్వారానూ నేర్చుకొనేవారు. ప్రమాదాలు జరిగినప్పటికీ ఆత్మవిశ్వాసమూ, ధైర్యమూ వారిని ముందుకు నడిపించేవి. ఆ ప్రోద్బలంతోనే వారు పశ్చిమాన పర్షియన్ సింధుశాఖ (గల్ఫ్) కు, ఆఫ్రికా తూర్పు తీరానికి; ఇండోనేషియా, కాంబోడియా, అన్నామ్ లకు; ఆగ్నేయాన బోర్నియా, సెలబీస్ వంటి సుదూర ప్రాచ్యుతీరాలకు చేరగలిగేవారు. 1920 దశకం తొలిరోజులలో ఆధునిక యుగ సముద్రయాన శిక్షణ మొదలయింది. భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందినప్పటి నుంచి ఒక ఆహ్లాదకరమైన మార్పు కెరటం ఆవరిస్తున్నది. కొన్ని శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన సముజ్జ్వలమైన భారతీయ నౌకాయాన సంప్రదాయం వెల్లివిరిసి మళ్ళీ వెలుగొందుతున్నది. భారతీయ నౌకాయానం ఇప్పుడు సవ్యమైన మార్గంలో పురోగమిస్తోంది.
  3. ఈ కింది ఆంగ్లవచనాన్ని తెలుగులోకి అనువదించండి : Orientation for entrepreneurship has to start right from the schools. In schools, teachers need to highlight the role of entrepreneurship in national development. During college, students must be exposed to business development opportunities and must be trained towards the creation of new enterprises. Parents should encourage their children to take up new ventures after their education. We should cultivate a mindset that 'Idea is wealth'. The government must create a facilitating environment for the provision of venture capital for innovative ideas without collateral security. Universities and engineering and management institutions should work with banks and other funding agencies towards simplifying procedures for setting up businesses and working with entrepreneurs till the project becomes self-sustaining and viable. Procedures in government should facilitate the spotting and recognition of new Indian talent in entrepreneurship by creating a level playing field for healthy competition. Citizens who can afford it should turn themselves into angel investors or start venture capital organizations to fund such new ventures. Big and small industries need to have an open mind in order to encourage and partner with young entrepreneurs.
  4. (a) ఈ కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి : 2×5=10 | (i) | కుందేటి కొమ్ము | 2 | | — | — | — | | (ii) | జవగళ్లు | 2 | | (iii) | ధర్మవడ్డి | 2 | | (iv) | పుక్కిటి పురాణం | 2 | | (v) | పెండ్లి నడక | 2 | (b) ఈ క్రింది పదాలకు పర్యాయపదాలను వ్రాయండి : 2×5=10 – (i) అమృతము 2 – (ii) ఎల్లప్పుడు 2 – (iii) కుమార్తె 2 – (iv) శపథము 2 – (v) సరస్వతి 2 (c) ఈ క్రింది పదాలకు వ్యతిరేకార్థక పదాలను వ్రాయండి : 2×5=10 – (i) నిరాకారము 2 – (ii) విద్య 2 – (iii) సదుపదేశము 2 – (iv) సూక్ష్మము 2 – (v) సౌభాగ్యము 2 (d) ఈ క్రింది పదాలలోని అక్షరదోషాలను సవరించండి : 2×5=10 – (i) చైత్ర యాత్ర 2 – (ii) జయోపజయాలు 2 – (iii) మణస్కారము 2 – (iv) శాఖాహారము 2 – (v) సాచనీయము 2

Questions reproduced from the official paper for study purposes; verify on the exam-conducting body’s official website.


Related — other papers of this exam

No Comments

Post A Comment