UPSC Civil Services (Main) Examination 2026 — Telugu Literature Paper II: Question Paper | Plutus IAS

UPSC Civil Services (Main) Examination 2026 — Telugu Literature Paper II: Question Paper | Plutus IAS

The questions below are from Telugu Literature Paper II of UPSC Civil Services (Main) Examination 2026 (held 2026-08-30) — the actual paper, which is public government content. This page carries the questions for reference and revision; model answers for this paper are not published here.

Official paper (PDF): upsc.gov.in.

  1. ఈ కింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి : 10×5=50 (a) ఈ కింది పద్యంలోని వస్తువు ఆధారంగా నైతిక విలువలను విశ్లేషించండి : విమల యశోనిధి పురుష వృత్త మెఱుంగుచునుండుఁ జూవెవే దములును బంచభూతములు ధర్మువు సంద్యులు నంతరాత్మయున్ యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్యహాపదా ర్థము లివి యుండగా నరుఁడు దక్కొన నేర్చునె తన్నుమ్రుచ్చిలన్. (b) ఈ కింది పద్యంలోని ధ్వని గర్భిత శబ్ద వాక్య ప్రయోగాలను వివరించండి : వచ్చినవాడు ఫల్గునుఁడవశ్యము గెల్లు మనంగరాదురా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే ? హెచ్చగుఁ గుండగుండొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా కిచ్చఁ దలంచి యొక్కమెయి నిత్తఱిఁ బొందగుచేతయుండగున్. (c) ఈ కింది పద్యంలోని గుణనిధి తల్లి మనోవేదనను చిత్రీకరించండి : విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెఱ్ఱివాడవై చెడుగులఁ గూడి ధౌర్యములు సేయ మహారమణుండెఱింగెనే విడుచును సోమయాజ మనువృత్తులు చేకొనునెల్ల భంగులన్ జెడుదుము నీకతంబుననుఁ జిరయుఁగూడును లేక ? పుత్రకా ! (d) ఈ క్రింది పద్యంలోని పదప్రయోగ వైచిత్రిని తెల్పండి : 10 ధళ ధళ మెఱపులు మెఱయగఁ బెళ పెళ నుఱుముచుఁ బెరిల్లు పెరిలునఁ బిడుగుల్ నలుగడఁ బడ బెడిదపుధా రలుగలబలువాన జలధరంబులు గురిసెన్. (e) కింది పద్యంలోని అలంకార వైశిష్ట్యాన్ని వివరించండి : 10 ఇన వంశోద్భవుడైన రాఘవుడు, భూమిశాత్మజల్ వేడ్కతోఁ దను వీక్షింప, మునీశ్వరుండలరఁ, గోదండంబు చేనంది, చి వ్వను మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహాశక్తితోఁ దీసినన్, దునిగెన్ జాపము భూరి ఘోషమున, వార్డుల్ మ్రోయుచందంబునన్.
  2. కింది ప్రశ్నల్లో రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి : (a) “దుష్కంతుడు-శకుంతల కథ నేటి తరానికి మేలుకొలుపు” వివరించండి. 20 (b) తిక్కన కవిత్యంలో ధర్మం, న్యాయం, రాజనీతి భావజాలాన్ని నేటి పరిస్థితిలో సమన్వయించండి. 20 (c) శతక లక్షణాలను ‘ఆంధ్ర నాయక శతకం’లో అన్వయించండి. 10
  3. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి : – (a) 'గుణనిధి కథ' నేటి సమాజానికిచ్చే సందేశమేమి ? 20 – (b) శాలినుడితో సుగాత్రి తన దాంపత్యాన్ని సరిదిద్దుకున్న తీరు నేటి తరానికి ఎలా ఆవశ్యకమో తెల్పండి. 20 – (c) 'అవతారిక' ఆధారంగా తెలుగు కవిత్వం గురించి మొల్ల వెలువరించిన అభిప్రాయాలను తెల్పండి. 10
  4. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి : 10×5=50 (a) విశ్వనాథ సత్యనారాయణ తెలుగు తల్లులు తమ పిల్లలకు శౌర్యరసాన్ని ఉగ్గు పాలతో రంగరించి పోసిన తీరును వివరించండి : వేగి రాజ్యపు పల్లె వీధుల చెడుగుళ్ల రిపుల గవ్వించు నేరుపులు తెలిసి ఎగురు గోడిబిళ్ల సాగసుల్లో రిపుశిర స్కూల బంతులాడు శిక్షలకు డాసి చెత్తాడి యుప్పు తెచ్చిన నాడె శాత్రవ వ్యూహముల్ పగిలించి నొఱపు గఱచి కోతి కొమ్మచ్చిలో కోటగోడల కెగఁ బ్రాకీ లంఘించు చంక్రమణ మెఱిఁగి తెనుఁగు లంతపై యవి నేర్చుకొనియయందు రెన్నగాఁ దెల్లుతల్లులు మున్ను శౌర్య రస మొడిచి యుగ్గుబాలతో రంగరించి బొడ్డుకొయని కూనకే పోయుదురట (b) ఈ క్రింది గేయంలోని ప్రకృతి స్వభావాన్ని తెల్పి, వాటి సంరక్షణకై మన బాధ్యతలేమిటో వివరించండి : సారభములేల చిమ్ము పుష్పవ్రజంబు ? చంద్రికలనేల వెదజల్లు చందమామ ? ఏల సలిలంబుపారు ? గాడ్వేల విసరు ? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను ? మావిగున్న కొమ్మను మధుమాసవేళ పల్లవము మెక్కి కోయిల పాడుటేల ? పరుల తనియించుటకో ? తన బాగు కొరకో ? గాన మొనరింపక బ్రతుకు గడవ బోకో ? (c) ఈ గేయం ద్వారా శ్రీకై యువత సౌమరితనాన్ని పటాపంచలు చేసిన తీరును తెల్పండి : పదండి ముందుకు ! పందండి త్రోసుకు ! పోదాం, పోదాం, పైపైకి ! ఎముకలు కృశ్చిన, వయస్సు మళ్ళిన సౌమరులారా ! చావండి ! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా ! రారండి ! (d) ఈ పద్యంలో జాఘవా లోకం పోకడను గూర్చి వావోయిన విధానాన్ని విశదీకరించండి : ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్చదీ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్రుత్తు లాఱునే (e) రాణి, లకుమతో తన ఆర్ద్రతను వెల్లడించిన విధం నేటి యువతకు సందేశాత్మకం ఎలానో వివరించండి : నిన్ను రాయలు కన్నులందున నిల్చినందుకు పరితపించను కాని దేశమ్మును తృణమ్మటు కాల ద్రోయుట ఎట్లు సైతును ? దేశ మొక దెస నీవు ఒక దెస తేల్చుకొను మెయ్యది ఘనమ్మా వ్యక్తి సంఘములందు ఎయ్యది ప్రథమ గణ్యము చెప్పవమ్మా !
  5. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి : – (a) “గురజాడ కథలు ఆధునిక సమాజ సంస్కరణకు పునాదులు” వివరించండి. 20 – (b) ‘అల్పజీవి’ కథానాయకుడి పాత్ర ద్వారా యువత నేర్చుకోదగ్గ అంశాలేమిటి ? 20 – (c) ‘మహా ప్రస్థానం’ యువ చైతన్యానికి మార్గదర్శి ఎట్లో విపులీకరించండి. 10
  6. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి : – (a) కుటుంబ, ఉద్యోగ సమతుల్యాన్ని సాధించడంలో ‘ఎన్.జి.ఓ.’ నాటకం ఇచ్చే సందేశం ఏమిటి ? 20 – (b) ‘కర్పూర వసంత రాయలు’ ‘భావుకతకు ప్రతీక’ విశ్లేషించండి. 20 – (c) ‘కృష్ణపక్షం’ లోని కాల్పనిక కవితా తత్వాన్ని (Romanticism) వివరించండి. 10

Questions reproduced from the official paper for study purposes; verify on the exam-conducting body’s official website.


Related — other papers of this exam

No Comments

Post A Comment